Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్నని చంపిన టీడీపీలో ఎలా చేరుతా? : వంగవీటి రాధ

విజయవాడలో వైకాపాకు పట్టుకొమ్మలా ఉన్న సీనియర్ నేత వంగవీటి రాధ పార్టీ మారబోతున్నారంటూ ఓ ప్రచారం సాగింది. ముఖ్యంగా, ఆయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ అధికార టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (16:14 IST)
విజయవాడలో వైకాపాకు పట్టుకొమ్మలా ఉన్న సీనియర్ నేత వంగవీటి రాధ పార్టీ మారబోతున్నారంటూ ఓ ప్రచారం సాగింది. ముఖ్యంగా, ఆయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ అధికార టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగింది. 
 
దీనిపై వంగవీటి రాధ స్పందించారు. "మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను. నాకు టీడీపీలో జాయిన్ అవ్వాల్సిన అంతా కర్మ పట్టలేదు. ఇంకోక్కసారి ఇలాంటి చెత్త వార్తలు రాస్తే పరువు నష్టదావా వేస్తా. జగన్‌ మోహన్‌ రెడ్డి నా సోదరుడు. నా ప్రాణం ఉన్నంతా వరకు వైసీపీలోనే ఉంటా. బెజవాడ 2019లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచి కృష్ణా జిల్లాలో మిగిలిన సీట్లను సైతం గెలిపించేందుకు నా సర్వశక్తులు వాడ్డుతా అంటూ ప్రకటించారు. 
 
అయితే, ఓ వర్గం నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వంగవీటి రాధ అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, రెండుసార్లు తన వద్దకు పిలిపించుకుని స్వయంగా బుజ్జగించినా, ఆయన వినలేదని, పార్టీ మారేందుకే మొగ్గు చూపారని తెలుస్తోంది. మల్లాది విష్ణును పార్టీలోకి తెచ్చినా, రాధ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని జగన్ హామీ ఇచ్చారని, అయితే, విష్ణుకు విజయవాడ సెంట్రల్ ఆఫర్ చేయడంతోనే వివాదం పెరిగిందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments