Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగ‌వీటి రంగాని కాపాడుకోలేక‌పోయాం... ఉన్న నేత‌ల్ని కాపాడుకోండి!

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (14:25 IST)
జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొన్న కాపు కుల ప్ర‌స్తావ‌న గ‌ట్టిగా తెచ్చిన నేప‌థ్యంలో వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ‌తికున్న కాపు నేత‌ల్ని కోల్పోకుండా చూడాల‌ని సంఘీయుల‌కు పిలుపునిచ్చారు. 
 
ఖమ్మంజిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో  మోహనరంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాధాకృష్ణ అనంత‌రం త‌మ సామాజిక వ‌ర్గం వారితో మాట్టాడారు. నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు... తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా ఉంటార‌ని వంగ‌వీటి రాధా చెప్పారు. రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే... అన్ని వర్గాల పేదల గుండె చప్పుడ‌ని, మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయాం... ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి, ఆలోచనతో... ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నా అని రాధా చెప్పారు.
 
నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది... వాళ్లేదో గొప్పగా భావిస్తూ... పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే, ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి అంటూ రాధా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments