Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతంలో వంగవీటి రాధ.. ఎవరితో టచ్‌లో ఉన్నాడో తెలుసా?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (20:12 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ తరువాత మీడియాకు కనిపించకుండా తిరిగారు వంగవీటి రాధ. వైసిపికి రాజీనామా చేసిన తరువాత ఆయన టిడిపిలో చేరుతారన్న ప్రచారం జరిగింది. రెండు ముహూర్తాలను కూడా ఫిక్స్ చేశారు టిడిపి నాయకులు. తన తండ్రి హత్య... ఆరోపణల నేపధ్యంలో టిడిపిలో చేరడం మంచిది కాదని చాలా మంది సన్నిహితులు రాధకు చెప్పారట. 
 
దీంతో రాధ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే వైసిపి నుంచి రాజీనామా చేసినప్పుడు మీడియా ప్రతినిధులనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు వంగవీటి రాధ. ఏ పార్టీలో చేరకుండా మళ్ళీ మీడియాకు కనిపిస్తే ఇబ్బంది అవుతుందనని భావించట్లున్నారు. 
 
అందుకే మీడియాకు గానీ, తన అనుచరులకు గానీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయనెక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఒక్క కుటుంబ సభ్యులకు తప్ప. వారితో కూడా వారానికి ఒకసారి మాత్రమే ఫోన్లో మాట్లాడుతున్నారనట వంగవీటి రాధ.
 
అయితే త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చంద్రబాబు పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన తరువాత తిరిగి ప్రజల్లోకి రావాలని, అప్పుడు టిడిపిలో చేరాలన్న నిర్ణయానికి వంగవీటి రాధ వచ్చినట్లు మరో ప్రచారం జరుగుతోంది. టిడిపిలో రాధ చేరడం ఆయన అనుచరుల్లో 80 శాతం మందికి ఇష్టం లేదు. అందుకే ఆయన వెనుకడుగు వేస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments