Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో జనవరి 2న వైకుంఠద్వార దర్శనం..

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (18:02 IST)
పవిత్ర పుణ్యస్థలం తిరుమలో జనవరి రెండో తేదీన వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం జనవరి ఒకటో తేదీ నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. వీటిని తిరుమలలోని మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో జారీ చేయనున్నారు. ఈ టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. 
 
జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రోజుకు 50 వేల మందికి చొప్పున ఈ దర్శనం కల్పిస్తారు. మొత్తం పది రోజుల పాటు 5 లక్షల టోకెన్లను జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ పది రోజుల కోటా పూర్తయ్యేంత వరకు ఆఫ్‌లైన్‌లో ఈ టోకెన్లను నిరంతరాయంగా జారీ చేస్తారు.
 
ఈ టోకెన్లను తిరుమలలో శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రి నగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూలు, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూలు‌లో టోకెన్లను జారీ చేసేందుకు వీలుగా తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments