Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో అంటరానితనానికి అంతిమయాత్ర

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (17:40 IST)
నిజమే.. మీరు.. విన్నది నిజమేనండి. భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ బి.ఆర్.అంబేద్కర్‌ కలలు కన్నది అందరు ఒకటేనని. అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో దళితులను అగ్రవర్ణాల ప్రజలు అంటరానివారిగానే చూస్తున్నారు. ఇలాంటి అంటరానితనానికి అంతిమయాత్ర అనే ఒక వినూత్న కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టారు ట్రాన్స్‌ఫామ్‌ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధులు. 
 
చిత్తూరు జిల్లాలోని నగరి, నిండ్ర, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లోని నాలుగు గ్రామాలలో దళితులు నివాసముండే ప్రాంతంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. దళితులు ఉన్న ప్రాంతానికి దళితవాడ అనే పేరు తీసి వేసి గ్రామస్థులు నిర్ణయించుకున్న పేరును బోర్డుగా తయారుచేయించి గ్రామం మధ్యలో నిలబెట్టారు. అంతేకాదు ఆలయంలో దళితులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దళితులు తక్కువ కులం కాదని, ప్రపంచంలో అందరు సమానమేనని ట్రాన్స్‌ఫామ్‌ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ వ్యవస్థాపకులు జయచంద్ర నాయుడు అంటున్నారు. 
 
అంతేకాదు శ్మశానాలు కూడా ఒకేచోట ఏర్పాటు చేస్తోందీసంస్థ. చనిపోయిన వారు ఏ కుల, మతాలకు చెందిన వారైనా ఒకే స్మశానంలో పూడ్చిపెడతామని చెపుతున్నారు. దేశంలో అగ్రవర్ణాలు ఇప్పటికీ దళితులను కించపరుస్తున్నాయని, ఇలాంటి వాటికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. మరోవైపు బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దళితులతో కలిసి ఆలయంలో పూజలు చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments