లోక్‌సభలో తెరాస ఎంపీలు మరోమారు హైకోర్టు విభజన అంశాన్ని బుధవారం ప్రస్తావించారు. దీనికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఘాటుగానే సమాధానమిచ్చారు. సభలో చిన్నపిల్లల్లా మాట్లాడవద్దని సూచించారు. మీరు ఏం చేస్తారో చేసుకోండని అవసరమైతే ప్రత్యేక హైకోర్టుపై సదానందగౌడ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని చెబుతామంటూ హెచ్చరిక ధోరణితో మాట్లాడటంతో సభలో కొన్ని క్షణాలు నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది.
హైకోర్టు విభజన అంశాన్ని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి ప్రస్తావించారు. ఆ తర్వాత నిజామాబాద్ ఎంపి కవిత మాట్లాడుతూ సభలో లేని వ్యక్తుల పేర్లను ప్రస్తావించారు. దీనికి వెంకయ్య నాయుడు అడ్డు చెపుతూనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించ వద్దన్నారు. సభలో చిన్నపిల్లల్లా మాట్లాడవద్దని హితవు పలికారు. మీరు ఏం చేస్తారో చేసుకోండని అవసరమైతే ప్రత్యేక హైకోర్టుపై సదానందగౌడ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని చెబుతామన్నారు.