Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పదవి నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారు : కేంద్రమంత్రి వెంకయ్య

తనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కౌంటర్ ఇచ్చారు. తాను కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలని కొందరు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (15:10 IST)
తనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కౌంటర్ ఇచ్చారు. తాను కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలని కొందరు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పవన్ విమర్శలపై ఆయన శనివారం ఢిల్లీలో స్పందిస్తూ... భారతదేశంలో ఏపీ ప్రత్యేక హోదాను భావనాత్మక విషయంగా మార్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
‘కొంతమందికేమో మోడీ దిగిపోవాలి.. మరికొందరికి చంద్రబాబు దిగిపోవాలి.. ఇంకొందరికేమో వెంకయ్య దిగిపోవాలి.. వీళ్ళంతా దిగిపోయిన తర్వాత మేం అధికారంలోకి రావాలని రకరకాల కోరికలతో వారు మాట్లాడుతున్నర’ని విమర్శించారు. కానీ వారందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని పవన్ ఉద్ధేశించి వెంకయ్య అన్నారు. వాస్తవాలు తెలియాల్సిన సామాన్యులకు మాత్రమేనని, వారికే నేరుగా సమాధానం చెపుతానని స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడేహక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.. కొందరు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు... వారందరికి నేను సమాధానం చెప్పను.. చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసని హితవు పలికారు.
 
పైగా, ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించకపోయినా ఏపీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న వారు అప్పుడు ఎక్కడ ఉన్నారని వెంకయ్య ప్రశ్నించారు? ప్రత్యేకహోదా గురించి పార్లమెంట్‌లో మాట్లాడింది తానేని వెంకయ్య నాయుడు మరోమారు గుర్తు చేశారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments