Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను దళిత బాంధవుడ్ని.. రోహిత్‌ అంశంలో నాపై దుష్ప్రచారం : బండారు దత్తాత్రేయ

Webdunia
మంగళవారం, 1 మార్చి 2016 (13:55 IST)
తాను దళిత బాధవుడిని, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేసినట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అందువల్ల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో తనకెలాంటి సంబంధం లేదనీ, అందువల్ల ఈ అంశంపై తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
రోహిత్ అంశం మరోమారు లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై బండారు దత్తాత్రేయ సమాధానమిచ్చారు. హెచ్‌ఆర్సీకి తాను రాసిన లేఖలో రోహిత్‌ పేరు ప్రస్తావించలేదని చెప్పారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనలో విపక్షాలు తనను టార్గెట్‌ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని... తనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. బీసీలు, దళితుల తరపున తాను ఎన్నో పోరాటాలు చేశానని... తానేమిటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసని ఆయన విపక్ష సభ్యులకు తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments