Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా వెల్లడి... ఏపీపై వరాల వర్షం కురిపించేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో నవ్యాంధ్రపై వరాల జల్లు కురిసే అవకాశం కనిపిస్తోంది. రాజధాని ‘అమరావతి’ కోసం భూములిచ్చి

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (08:32 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో నవ్యాంధ్రపై వరాల జల్లు కురిసే అవకాశం కనిపిస్తోంది. రాజధాని ‘అమరావతి’ కోసం భూములిచ్చిన రైతులతో మొదలుకుని... విభజన తర్వాత వచ్చిన విద్యాసంస్థలకు నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పలు శుభ వార్తలు వినిపిస్తారని అధికార టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ముఖ్యంగా రాజధాని కోసం భూ సమీకరణ విధానంలో తమ పంట భూములను ఇచ్చిన రైతులకు కేంద్రం తీపి కబురు అందించబోతోంది. రాజధాని రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను తొలిసారి విక్రయించగా వచ్చే సొమ్ముపై పన్ను (క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌) తొలగింపుపై సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
 
బడ్జెట్‌లో ఏపీకి తగిన విధంగా కేటాయింపులు చేయాలని జైట్లీని కేంద్ర మంత్రి సుజనా చౌదరి కలుసుకుని విన్నవించారు. ఆ సందర్భంగా జైట్లీ స్పందిస్తూ... బడ్జెట్‌లో నవ్యాంధ్రకు చాలా వరాలున్నాయని, ముందే చెబితే పత్రికలు లీక్‌ చేస్తారంటూ నవ్వుతూ తన కార్యాలయంనుంచి పంపారు. బడ్జెట్‌లో ఏపీకి పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీకి కేటాయించిన జాతీయస్థాయి విద్యా సంస్థలకు భారీగానే నిధులను కేటాయించే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. 

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments