Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ చనిపోయేటట్టు ఉన్నాడని చెప్పడం వల్లే విభజన.. జైపాల్ మీరే నిజం చెప్పండి.. ఉండవల్లి

రాష్ట్ర విభజనపై తాను రాసిన పుస్తకం కట్టుకథ అయితే మీరే నిజం చెప్పండి అంటూ కేంద్ర మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత ఎస్. జైపాల్ రెడ్డికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా కోరారు. ఇదే అంశంపై ఆయన

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (11:52 IST)
రాష్ట్ర విభజనపై తాను రాసిన పుస్తకం కట్టుకథ అయితే మీరే నిజం చెప్పండి అంటూ కేంద్ర మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత ఎస్. జైపాల్ రెడ్డికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా కోరారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 'నాది కట్టుకథే. నేను ఊహించి రాసిందే. విశ్లేషణ మాత్రమే. నాడు స్పీకర్‌ చాంబర్‌లో సుష్మాస్వరాజ్‌, కమలనాథ్‌ మధ్య రాజీ కుదిర్చానని మీరే చెప్పా రు. అసలు లోపల ఏంజరిగింది? ఇప్పటికైనా నిజాలు చెప్పండి' అని డిమాండ్‌ చేశారు. 
 
‘అప్పట్లో.. స్పీకర్‌ చాంబర్‌లో జరిగింది చెబితే ఎన్నికల్లో ఓడిపోయేవాడిని కానన్నారు. ఆరోజు చొరవ తీసుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. పైగా కొంతవరకైనా రాజ్యాంగ మర్యాదలు పాటించాననీ చెబుతున్నారు. అంటే.. లోపల జరిగిన విషయాన్ని బయటకు చెప్పలేకపోయారంటే అక్కడ కుట్ర జరిగింది. అనర్థం జరిగింది. అందుకే మీరు బయటకు చెప్పలేకపోయారు’ అని ఉండవల్లి విమర్శించారు. 
 
‘నా వాదన ఒకటే. విభజన బిల్లు పాసవ్వలేదు. ఓటింగ్‌ జరగలేదు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసినా మెజారిటీ లేదు. ఏం చేయాలో అర్థంకాని సమయంలో ఓటింగ్‌ లేదు, గీటింగు లేదని జైపాల్‌ సలహా ఇచ్చారు. అంతకుమించి ఆయన చేయడానికి అక్కడ ఏముంది? బీజేపీ అడ్డుకోవడానికి సిద్ధంగా లేదు. జైపాల్‌ రెడ్డిగారూ! రాజ్యాంగంపట్ల మీకు ఉన్న అంకితభావం, అభిమానాన్ని ప్రజల ముందు ప్రదర్శించండి. సభలో అసలేం జరిగిందో చెప్పండి. కేసీఆర్‌ చనిపోయేటట్టు ఉన్నాడని చెప్పకపోతే తెలంగాణ వచ్చేదికాదని ఉండవల్లి తేల్చి చెప్పారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments