Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారును చంద్రబాబు గద్దె దించాలి: ఉండవల్లి సలహా

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు తిరుగుబాటు చేశారని.. ఎన్డీఏలో వున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ సర్కారున

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:11 IST)
కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు తిరుగుబాటు చేశారని.. ఎన్డీఏలో వున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ సర్కారును గద్దె దించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ సలహా ఇచ్చారు.

ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు వ్యతిరేకంగా, మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్ను సిన్హా నేతృత్వంలో సమావేశం నిర్వహించారని ఉండవల్లి గుర్తు చేసారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు వారితో కలిసి ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం చంద్రబాబు చేతుల్లో వుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. 
 
చంద్రబాబు మోదీకి బుద్ధి చెప్పాలంటే.. ఇదే సరైన తరుణమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేసులకు, జైళ్లకు భయపడటం మానేసి.. ఎదురుదాడికి దిగాలని ఉండవల్లి పిలుపునిచ్చారు.

దేశంలో జ్యుడీషియరీని ఎదుర్కోవడంలో బాబు తర్వాతే ఎవరైనా అంటూ ఉండవల్లి విమర్శించారు. కాబట్టి కేసీఆర్ తరహాలో ఎదురుదాడికి దిగాలని ఉండవల్లి సూచించారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments