Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా?

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (09:10 IST)
ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన వారిలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ ఒకరు. దివగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మినబంటుల్లో ఒకరు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. రాజమండ్రి పర్యటన సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఉండవల్లి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగుతుంది. దీనిపై ఉండవల్లి తాజాగా క్లారిటీ ఇచ్చారు. 
 
తాను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. పైగా, వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల రాజమండ్రికి వస్తే తన ఇంటికి రాకుండా పోతుందా అని ఆయన ప్రశ్నించారు. తాను ఇకపై క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 2019 కంటే 2024లో పరిస్థితి కాస్త మెరుగుపడిందన్నారు. 
 
అలాగే, వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల అంశంపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. అది వారి కుటుంబ విషయాలని అన్నారు. తాను ప్రజా సమస్యలపై మాత్రమే స్పందిస్తానని చెప్పారు. కుటుంబ విషయాలు వాళ్లే చూసుకుంటారని చెప్పారు. కుటంబ తగాదాలను కూడా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా, అవన్నీ వారు చూసుకుంటారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments