Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు భారతీయులేనా? జాతీయత నిరూపించుకోండి?

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (13:43 IST)
మీరు భారతీయులేనా? మీ జాతీయ ఏంటి.. ఇపుడు జాతీయతను నిరూపించుకోండి అంటూ 127 మంది హైదరాబాదీలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) షాక్‌ ఇచ్చింది. ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.
 
తమ ఆదేశాల ప్రకారం భారత పౌరులమని నిరూపించుకోకపోతే ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని తెలిపింది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తోన్న సత్తర్‌ ఖాన్‌ అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్‌ కార్డు అందుకున్నారన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్‌ ఈ నెల 3వ తేదీన అతనికి నోటీసులు జారీ చేసింది.
 
పౌరసత్వం లేకపోతే, భారత్‌లోకి చట్టబద్ధంగానే ప్రవేశించామన్న విషయాన్ని నిరూపించుకోవాలని తేల్చిచెప్పింది. దీంతో అతడు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తన ఆవేదనను తెలిపాడు. 
 
పౌరసత్వం నిరూపించుకోవాలని, ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలని  127 మంది హైదరాబాదీలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసులు జారీ చేసిన విషయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విరుచుకుపడ్డారు.
 
'పౌరసత్వాన్ని ధ్రువీకరించే అధికారం ఉడాయ్‌కు లేదు. ఆధార్‌ కార్డులను తప్పుడు సమాచారంతో పొందితే దాన్ని పరిశీలించేందుకు కొన్ని అధికారాలు మాత్రమే ఉడాయ్‌కు ఉంటాయి. చట్టబద్ధమైన ప్రక్రియను ఉడాయ్‌ పాటించలేదు. తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసింది' అని అసదుద్దీన్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments