Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిల్లలున్నారు మొర్రో అంటున్న వదల్లేదు.. పెళ్లి చేసుకోమని లేడీ కానిస్టేబుల్స్ ఒత్తిడి

ఆ కానిస్టేబుల్‌కు అప్పటికే వివాహమై భార్యాపిల్లలు ఉన్నారు. కానీ, తనతో పాటు పని చేసే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. చివరకు తనను కూడా పెళ్లి చేసుకోవాలం

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (14:19 IST)
ఆ కానిస్టేబుల్‌కు అప్పటికే వివాహమై భార్యాపిల్లలు ఉన్నారు. కానీ, తనతో పాటు పని చేసే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. చివరకు తనను కూడా పెళ్లి చేసుకోవాలంటూ ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒత్తిడి చేశారు. వీరి ఒత్తిడిని తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాజారాంపురి పోలీసు స్టేషన్‌కు చెందిన 42 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్‌కు వివాహమైంది. గతంలో 2012 నుంచి 2014 వరకు గాంధీనగర్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్నపుడు తనతోపాటు పనిచేస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తననంటే తననే పెళ్లి చేసుకోమని కానిస్టేబుల్‌పై ఒత్తిడి తెచ్చారు. ఓ మహిళా కానిస్టేబుల్ కానిస్టేబుల్ భార్య వద్దకు వచ్చి భర్తకు విడాకులు ఇవ్వాలని బెదిరించింది. భార్య ఉండగానే, మరో ఇద్దరు సహ ఉద్యోగినులైన మహిళా కానిస్టేబుళ్లు పెళ్లి చేసుకోమని వేధిస్తుండటంతో ఆవేదన చెందిన కానిస్టేబుల్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేర ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments