Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ స్థాయిలో ఏపీకి "పోషణ్ అభియాన్" అవార్డులు

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (18:53 IST)
జాతీయ స్థాయిలో "పోష ణ్ అభియాన్" కార్యక్రమాన్ని సమర్ధవంతంగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా అమలు చేయడంలో ఆంధ్ర ఆప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండు, క్షేత్ర స్థాయిలో రెండు అవార్డులను పొందింది. 2018-19 సంవత్సరానికి  "పోష ణ్ అభియాన్" అవార్డులను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వివిధ విభాగాలలో  ప్రదానం చేశారు.  
 
న్యూ ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో 2018-19 సంవత్సరానికి పోషణ్ అభియాన్ అవార్డులను మంత్రి స్మృతి ఇరానీ అవార్డు గ్రహీతలకు అందచేశారు. అంగన్ వాడి కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులలో పోషకాహారలోపం, రక్తహీనతను తగ్గించి శిశుమరణాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న " పోషణ్ అభియాన్" కార్యక్రమం అమలులో ఆంధ్ర ప్రదేశ్ రెండు జాతీయ అవార్డులను, క్షేత్ర స్థాయిలో పలు అవార్దులను పొందింది. 

సమగ్ర స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ కామన్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ అమలులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మొదటి స్థానం పొందగా, ఇందుకుగాను కోటి రూపాయల నగదు పురస్కారాన్ని, పోషకాహారం పంపిణీలో రెండవ స్థానం పొందగా ఇందుకు గాను డెబ్భై ఐదు వేల రూపాయల నగదు పురస్కారాన్ని,  అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆంధ్ర ప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డా. దమయంతికి, ఆ శాఖ సంచాలకులు డా. కృతిక శుక్లాకు అందచేశారు. 

నాయకత్వ అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యం. డి. ఇంతియాజ్ అహమ్మద్ కు, ప్రాజక్టు స్థాయిలో అనంతపురం జిల్లా సింగనమల సి.డి.పి.ఓ. జి.వనజ అక్కమ్మకు, క్షేత్ర స్థాయిలో గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా పుత్తూరు కార్యకర్తలకు అవార్డు, జ్ఞాపికలను కేంద్ర మంత్రి అందచేశారు. 
 
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ... వివిధ విభాగాల్లో 363 అవార్డులు ఇవ్వడంతో పాటు 22 కోట్ల రూపాయల నగదు పారితోషికాన్ని అవార్డు గ్రహీతలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. మహిళా శిశు సంక్షేమానికి అన్ని విభాగాలు, సంస్థల సహాయ సహకారంతో పోషకాహార లోపం యొక్క సవాళ్లను పరిష్కరిస్తున్నామని, పోషకాహార లోపంలేని దేశంగా భారత్ ను తీర్చిదిద్దుతున్నామని, తమ కృషిలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం కోరుతున్నామని  ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

"పోషణ్ అభియాన్" స్కేల్ చేయడంలో, దేశంలోని ప్రతి ఇంటికి చేరేలా చూసేందుకు రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, అంగన్‌వాడీ కార్యకర్తలు చేసిన కృషికి ఈ అవార్డులు ప్రధానం చేసినట్లు చెప్పారు. 

ఈ పురస్కారాలు ప్రాధమిక వాటాదారులను ప్రేరేపించడం మరియు పోషకాహారలోపాన్ని ఎదుర్కోవటానికి అవగాహన కల్పించడంలో పెద్ద ఎత్తున పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, లబ్ధిదారులకు సేవా బట్వాడాను మెరుగుపరిచేందుకు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి కూడా ఈ అవార్డులను ప్రోత్సహించి ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. 

వచ్చే నెల నుండి  పోషణ్ అభియాన్ ప్రచార కార్యక్రమం ద్వారా ఒక నెల కాలంలో 44 కోట్ల మందిని అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  ఈ కార్యక్రమం ద్వారా గత సంవత్సరం  22 కోట్ల మందిని చేర్చామన్నారు.  పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి మరింత సమన్వయం అవసరమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నొక్కి వక్కాణించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments