Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఫోన్ కాల్స్.. సినీ ఫక్కిలో...

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (18:43 IST)
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఫోన్‌లో బెదిరించిన ఆగంతకులను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి గత పది రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆగంతకులు మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాణహానీ తప్పదంటూ ఎమ్మెల్యేను హెచ్చరించారు.
 
రామకృష్ణా రెడ్డి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ట్రాప్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ముగ్గురు యువకులు వచ్చి 40 వేలు తీసుకుంటూ సినీ ఫక్కీలో పోలీసులకు పట్టుబడటం జరిగింది. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల సమీపంలో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 29వ తేదీన సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి జగదీష్ పేరిట ఓ లేఖ వచ్చింది. 
 
ఇందులో ఆరునెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రామకృష్ణారెడ్డిని కలవడానికి ఇద్దరిని కేటాయిస్తే భద్రతా కారణాల వల్ల వారు అప్పట్లో కలవలేదని, గత నెలలో ఆంధ్రా, ఒడిశ్శా సరిహద్దుల్లో జరిగిన పార్టీ చర్చావేదికలో ఈ అంశం చర్చకు వచ్చిందని చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments