Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోజో టీవీకి టీవీ9 ఛానల్ లోగోను అమ్మేశారు.. రవిప్రకాశ్‌పై కేసు

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (12:35 IST)
టీవీ9 ఛానల్ లోగో సహా ఆరు లోగోలను తన సొంత ఛానల్ మోజో టీవీకి అమ్మోశారంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.99 వేలకు విక్రయించారని ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇదంతా మౌఖిక ఒప్పందం ప్రకారమే జరిగిందని తెలిపారు. ఈ మేరకు గతేడాది 31న డీడ్ ద్వారా వాటిని రాసి ఇచ్చేసినట్టు వివరించారు. 
 
టీవీ9 లోగోలు అమ్మినందుకు ప్రతిగా రావాల్సిన రూ.99 వేలను నెక్ట్స్‌ ఇండియా నుంచి ఏబీసీపీఎల్‌కు బదిలీ చేశారు, కానీ ఆ మొత్తాన్ని ''అదర్‌ రిపెయిర్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌''గా పేర్కొన్నారని కౌశిక్ రావు తన ఫిర్యాదులో తెలిపారు.

కోట్ల రూపాయల విలువచేసే లోగోలను రవిప్రకాశ్ అక్రమంగా కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించేలా విక్రయించారని కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌కు ఉచ్చు బిగుస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments