Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ గిరి : అరుణాచల్‌కు మోత్కుపల్లి .. తమిళనాడుకు ఆనందిబెన్‌ పటేల్‌

కేంద్ర ప్రభుత్వం మరో రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించనుంది. ఇందులోభాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా టీటీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు నియమితులు కానున్నారు. దీనిపై కేంద్రం త్వరలో నిర్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (08:36 IST)
కేంద్ర ప్రభుత్వం మరో రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించనుంది. ఇందులోభాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా టీటీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు నియమితులు కానున్నారు. దీనిపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్‌ పదవి ఇస్తామని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అనివార్య కారణాలతో అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కాగా, ఇటీవల కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లాతో పాటు నలుగురిని గవర్నర్లుగా నియమించారు. 
 
అప్పుడే మోత్కుపల్లిని కూడా గవర్నర్‌గా నియమించాలని కేంద్రం భావించినా.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నందున మోత్కుపల్లి విషయాన్ని పక్కనబెట్టింది. ప్యాకేజీ ప్రకటన తర్వాత మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇస్తామని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీ అయిన తమిళనాడు, అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ పదవులు త్వరలో భర్తీ చేయనున్నారు. ఆ భర్తీల్లో భాగంగా మోత్కుపల్లికి అవకాశం రావొచ్చు. ఎందుకంటే మోత్కుపల్లి బయోడేటాను పీఎంఓ పరిశీలిస్తోంది. 
 
దీనిపై పీఎంవో అధికారులు, సీఎం చంద్రబాబుతో, మోత్కుపల్లితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. తమిళనాడు గవర్నర్‌గా గుజరాత మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అరుణాచల్‌కు మోత్కుపల్లిని నియమించకపోతే.. మణిపూర్‌ గవర్నర్‌ నజ్మాహెప్తుల్లాను అరుణాచల్‌కు మార్చి.. అక్కడ నియమిస్తారన్నది హస్తిన వర్గాల సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments