Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు కలెక్టర్‌వా? ఐతే ఏంటి పోవయ్యా పో పో... తిరుమల ఆలయంలోకి వెళుతుండగా తోసేసిన విజిలెన్స్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (16:22 IST)
నేను చిత్తూరుజిల్లా కలెక్టర్‌ని. భరత్ నారాయణ్ గుప్త నా పేరు. నేనే రాష్ట్రపతి పర్యటనలో పర్యవేక్షణ అధికారిగా ఉన్నాను. మొత్తం నేనే చూసుకుంటున్నాను. నేను కూడా లోపలికి వెళ్ళాలి పంపించండి అంటూ ప్రాధేయపడ్డారు కలెక్టర్. సాక్షాత్తు కలెక్టర్‌నే అవమానించే విధంగా టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రవర్తించారు.
 
నిన్న రాష్ట్రపతి పర్యటనలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయనతో పాటు అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు చిత్తూరు జిల్లా కలెక్టర్. తిరుమల రాష్ట్రపతి కుటుంబ సభ్యులతో కలిసి వెనక్కి వెళుతుండగా ఉన్నట్లుండి విజిలెన్స్ వారు ఆపేశారు. ఎవరు మీరు వెళ్ళొద్దండి అంటూ నిలిపేశారు.
 
తాను కలెక్టర్‌నని ఎంత చెప్పినా అస్సలు వినిపించుకోలేదు టిటిడి విజిలెన్స్ అధికారులు. సుమారుగా 15 నిమిషాల పాటు బయటే తిరిగారు కలెక్టర్. చివరకు టిటిడి సివిఎస్ఓ కలుగజేసుకుని విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో లోపలికి పంపారు. కలెక్టర్‌కు అవమానం జరిగిందని ఉద్యోగస్తులందరూ నిరసనకు దిగారు. ఈరోజు తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి జరిగిన ఘటనపై విచారణ జరిపి విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments