Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు శుభవార్త: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో శ్రీవారి దర్శనం టిక్కెట్లు..

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (10:47 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంచారు. లాక్‌డౌన్ కారణంగా ఈ నెల 11 నుంచి సాధారణ భక్తులకు స్వామి దర్శనం టీటీడీ కల్పించింది.
 
ఈ నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తూ ప్రతి రోజు 7 వేల మందికే అవకాశం ఇచ్చారు. తాజాగా ఆ కోటాను పెంచారు. దీంతో ఇప్పటి వరకు ప్రతి రోజు 7 వేల మందికి మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉండగా, ఇక నుంచి 10 వేల మందికి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన టోకెన్ల జారీకి అధికారులు సిద్ధమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఒక్కరోజే 7,172 మంది భక్తులు దర్శనం కోసం వచ్చారు. హుండీ ఆదాయం 42 లక్షలుగా ఉన్నట్టు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తిరుగిరుల్లో థర్మల్ స్రీనింగ్, శానిటైజేషన్ పక్కాగా చేస్తున్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. దీంతో పాటు గురువారం నుంచి అక్కడ అధికారులు నో హారన్ జోన్ కూడా అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ - ప్రైమ్ మనీ ఎంతో తెలుసా?

మంచు మనోజ్ ఇంటి జనరేటర్‌లో చక్కెర పోసిన మంచు విష్ణు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments