Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాలు రద్దు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (17:19 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మొత్తం తొమ్మిది రోజులపాటు స్వామివారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 18వ తేదీన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను తొమ్మిది రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటుచేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబరు 18వ తేదీన స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 
 
గరుడ సేవ రోజును రద్దీని దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. భక్తులకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు రుయా ఆస్పత్రి సిబ్బందిని రపిస్తామని తెలిపారు. ఘాట్‌ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, క్రూర మృగాల సంచారం నేపథ్యంలో నడకదారులు, ఘాట్ రోడ్లలో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటవీ శాఖ ఇచ్చే నివేదిక మేరకు నడక మార్గంలో నిబంధనలను సడలిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments