Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిశుధ్య కార్మికులకు టీటీడీ గుడ్‌న్యూస్- జీతాల పెంపు

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (18:59 IST)
పారిశుధ్య కార్మికులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. టీటీడీ పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచుతున్నట్లు భూమన టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. టీటీడీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు మీడియాకు వివరించారు. 
 
మొత్తం ఐదు వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాల పెంపు వర్తిస్తుందని తెలిపారు. అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.  
 
టీటీడీ పరిధిలోని కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా నిర్ణయించామన్నారు కరుణాకర్ రెడ్డి. కార్పొరేషన్‌లో పని చేసే ఉద్యోగులు అకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. 
 
అదేవిధంగా కార్పొరేషన్‌లో పని చేస్తూ ఈఎస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తామన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటుకు 18 కోట్లు కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments