Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. ఇవ్వడం కష్టమని ఆ నాడు తెలియదా? : ఎంపీ కవిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెరాస చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కె కవిత అన్నారు. ఆమె గురువారం నందిగామలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజ

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (10:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెరాస చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కె కవిత అన్నారు. ఆమె గురువారం నందిగామలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. నాటి ప్రధానితో పాటు.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాంకేతికంగా ఇవ్వలేక పోయినా.. రాజకీయపరంగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు. అసలు 'దక్షిణాది రాష్ట్రాలకు హోదా ఇవ్వడం కష్టమంటున్న పాలకులకు అప్పట్లో ఆ విషయం తెలియదా? ఆచరణ సాధ్యం కాని హామీని ఎందుకిచ్చారు? ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకటించిన హోదా హామీని నెరవేర్చాల్సిందే. దీని కోసం ఆంధ్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది' అని ఆమె వ్యాఖ్యానించారు.
 
హోదాకు రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగని కేంద్రంతో నిత్యం పోరాటాలు చేయలేమన్నారు. కేవలం పాలనాపరమైన సౌలభ్యం కోసమే రాష్ట్ర విభజన జరిగింది తప్ప తెలుగు ప్రజలంతా ఒక్కటేనని స్పష్టంచేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments