Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ కేసులో ఆ ముగ్గురి తెరాస నేతల పేర్లు... ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారట..

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో అధికార తెరాస నేతలతో పాటు.. ఇతర రాజకీయ నేతలు, అధికారులకు కష్టాలు తప్పేలా లేవు. నయీమ్ భూదందాలకు సహకరించిన నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను ఇప్పటికే విచ

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (09:16 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో అధికార తెరాస నేతలతో పాటు.. ఇతర రాజకీయ నేతలు, అధికారులకు కష్టాలు తప్పేలా లేవు. నయీమ్ భూదందాలకు సహకరించిన నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు ముగ్గురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ ముగ్గురు కీలక నేతలని తెలిసింది. నయీంతో సంబంధాలపై ముగ్గురు నేతల స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు.
 
నయీమ్ ఇంట్లో సేకరించిన ఫోటో ఆల్బమ్‌లతో పాటు, నయీమ్ ఫోన్‌కాల్ డేటా ఆధారంగా నేతల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. పూర్తి ఆధారాలు సేకరించన తర్వాత ఆ ముగ్గురు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సిట్ పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకు స్థానిక పోలీసులపై నేతల ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సిట్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు.
 
ఇదిలావుంటే, గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఉపయోగించిన ఆయుధాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సీఐ రామకృష్ణ తెలిపారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతను ఉపయోగించిన ఆయుధాలు ఏకే 47, మూడు రివాల్వర్లు, ఇతర మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments