Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన జేసీ దివాకర్ రెడ్డి.. విమానం ఎక్కనీయొద్దు :: వెనుదిరిగిన టీడీపీ ఎంపీ!

అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొలి దెబ్బ తగిలింది. వైజాగ్ విమానాశ్రయంలో చేసిన హడావుడి పర్యావసనాన్ని ఆయన ఎదుర్కొన్నారు. జేసీని విమానం ఎక్కనీయకుండా విమాన సిబ్బంది

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (10:18 IST)
అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొలి దెబ్బ తగిలింది. వైజాగ్ విమానాశ్రయంలో చేసిన హడావుడి పర్యావసనాన్ని ఆయన ఎదుర్కొన్నారు. జేసీని విమానం ఎక్కనీయకుండా విమాన సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో చేసేదేం లేక వెనుదిరిగారు. ఆదివారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది. 
 
ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆదివారం ఉదయం 6:40 గంటలకు విజయవాడ వెళ్లే ట్రూ జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆయన టికెట్ బుక్ చేసుకోగా, "మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేము" అని ట్రూ జెట్ సిబ్బంది స్పష్టం చేశారు.
 
దీంతో చేసేదేమీ లేక జేసీ వెనుదిరిగారు. ఇటీవల విశాఖపట్నంలో ఆయన విమానాశ్రయ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జేసీపై పలు విమానయాన సంస్థలు నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఘటన జరిగిన రోజు విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చొరవతో విమానం ఎక్కినా, ఆ తర్వాత జేసీ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కలేకపోవడం ఇదే తొలిసారి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments