8వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్‌పై శిక్షణ: మంత్రి ఆదిమూలపు సురేశ్

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (21:19 IST)
తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో నిర్వహించిన ఉన్నత విద్యామండలి సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 100 శాతం ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ఉపకరించే సాంకేతికత అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పరిశోధనలకు పెద్దపీట వేయాలని ఉన్నత విద్యామండలి సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు. 8వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ పైన తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
 
ఈ ఏడాది 2.20 లక్షల మంది డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రవేశం కల్పించామని మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లోనూ ఆన్లైన్ ప్రవేశాలు చేపడతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments