Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నేడు టెట్ పరీక్షా ఫలితాలు రిలీజ్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. గత ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ టెట్ పరీక్షల్లో 407329 మంది పరీక్ష రాశారని చెప్పారు. వారిలో 58.07 శాతం మంది అర్హత సాధించినట్టు తెలిపింది. 
 
అయితే, శుక్రవారం నుంచి అభ్యర్థులు వారి మార్కుల వివరాలను htpps//:cse.ap.gov.in/DSE/ అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీనే ఈ ఫలితాలు విడుదలకావాల్సివుంది. కానీ, పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఫలితాల్లో జాప్యం ఏర్పడింది. 
 
మరోవైపు, 5.25 లక్షల మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అంతమందికి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయలేక విద్యాశాఖ చేతులెత్తేసింది. దీంతో దాదాపు లక్ష మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దూరమయ్యారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments