Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ అందుబాటులో న్యాయం... నేషనల్ లీగల్ సర్వీసెస్ డే

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (11:38 IST)
దేశంలో పౌరులంద‌రికీ న్యాయం చేయాల‌ని... అంద‌రికీ అందుబాటులో న్యాయం ఉండాల‌నేదే జాతీయ న్యాయ సేవాధికార సంస్ద ధ్యేయమని ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్ద ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మ‌యి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్ద ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో వివిధ వర్గాల ప్రజలు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ని నిర్వహించారు. 

 
ఈ సందర్బంగా తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక దివ్యాంగ విద్యార్ది చేత కేక్ కట్ చేయించారు. అనంతరం స్వర సంగమం పేరిట కార్యక్రమంలో పాల్గొన్న వారితో జాతీయ న్యాయ సేవాధికార సంస్ద ధీమ్ సాంగ్ ను ఆలపించారు. తర్వాత లెట్స్ వాక్ లెగ్స్ వాక్ పేరిట జిల్లా కోర్టు నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మియి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు జాతీయ న్యాయ సేవల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.


దేశంలో ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డైనా అన్యాయం జ‌రిగిన‌పుడు వారు స్వచ్చందంగా న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యిస్తార‌ని, దీని కోసం స్థోమ‌త లేని వారికి ఉచిత న్యాయ స‌హాయం కూడా అందిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే, ఏ ఒక్క‌రికి కూడా న్యాయం అంద‌ని ప‌రిస్థితి గాని, న్యాయ వ్య‌వ‌స్థ‌ను చేరేందుకు ఆటంకాలు గాని ఉండ‌కూడ‌ద‌నేది త‌మ ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments