Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న పూరీ, నేడు ఛార్మి... టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:34 IST)
టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో మొన్న ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ ను ఈడీ విచార‌ణ చేసింది. ఈ రోజు హీరోయిన్ ఛార్మిని విచారిస్తున్నారు. పూరీ, ఛార్మి జంట‌గా ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉంద‌ని టాలీవుడ్ లో టాక్. ఇద్ద‌రూ క‌లిసే పార్టీల‌కు తిర‌గ‌డం, డైరెక్ష‌న్, క‌థా సిట్టింగ్ ల‌కు కూర్చోవ‌డం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఛార్మీని ఏ విధంగా ఇ.డి. విచారిస్తుందో అన్న‌ది ఆస‌క్తిగా మారింది. 
 
డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కోణంలో ఛార్మి బ్యాంక్ అకౌంట్స్ ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్ లోకి ఛార్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందా? ఛార్మి ప్రొడక్షన్ హౌజ్ ఆర్థిక లావాదేవీలపై అరా తీయనుంది. కెల్విన్ కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత కాలంగా కెల్విన్ తో చార్మికి పరిచయం ఉంది? డ్రగ్స్ సేవించారా? కెల్విన్ తో పాటు సరఫరాకు కూడా సహకరించారా? అసలు ఎన్ని సార్లు కెల్విన్ అకౌంట్ కు ఛార్మి… మనీ ట్రాన్స్ఫర్ చేసిందన్న కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ చేయనుంది.
 
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్‌గా మారాడు. ఆరు నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్‌పై కేసు నమోదు చేశారు. గ‌తంలో విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్ ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది. అప్రూవర్‌గా మారిన కెల్విన్ ఈడీకి ఏం స‌మాచారం ఇచ్చాడో అనే గుబులు ఇపుడు సినీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ఎపిక్ ఫాంటసీ డ్రామాగా గత వైభవ చిత్రం

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments