Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 12,608 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (12:40 IST)
దేశంలో కొత్తగా మరో 12 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 3.62 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే మూడు వేల కేసులు అధికం కావడం గమనార్హం. 
 
గత 24 గంటల్లో 12608 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటితో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 4,42,98,864 మందికి ఈ వైరస్ సోకింది. ఇందులో 4,36,70,315 మందికి బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
అలాగే, ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 72 మంది మరణించగా, 16,251 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
రోజువారీ పాటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 208.95 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments