Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జనసేనాని'కి తెలంగాణ గవర్నర్ ప్రశంసలు.. శభాష్ అంటూ ట్వీట్

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (10:57 IST)
జనసేనాని, టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభినందనలు తెలిపారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామిని కూడా ఆమె అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. వారిద్దరికీ గవర్నర్ అభినందనలు తెలపడానికి కారణం లేకపోలేదు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామం నుంచి 30 మంది మత్స్యకారులు తమిళనాడు తీర ప్రాంతానికి చేపల వేటకు వెళ్లారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా వారంతా చెన్నై హార్బ‌ర్‌లో చిక్కుకు పోయారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌త్య్య‌ుకారులు అక్క‌డ వ‌స‌తి, భోజ‌న స‌దుపాయాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వారికి త‌గు స‌దుపాయాలు కల్పించాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి విజ్జప్తి చేస్తూ లేఖ రాశారు.
 
పవన్ కళ్యాణ్ వినతిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తక్షణం స్పందించారు. సంబంధిత అధికారులకు అదేశాలకు ఆదేశాలుజారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఏపీ మత్స్యకారులకు తగిన సదుపాయాలను కల్పించారు. మ‌త్స్యకారుల ఇబ్బందుల‌ను నివారించ‌డానికి త‌న వంతు పాత్ర‌ను పోషించిన ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ను, అందుకు తగినట్లు స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్‌రాజన్ అభినందిస్తూ ట్విట్ట‌ర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments