Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల కమీషన్ ఏం చేస్తోంది? బతికివుందా? లేక చచ్చిపోయిందా?

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:16 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? బతికివుందా? చచ్చిపోయిందా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి ఉప ఎన్నికలో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు బయటి ప్రాంత వ్యక్తులు తిరుపతినిలో తిష్టవేశారని ఆరోపించారు. వారిని అరెస్టు చేయాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు.

అయినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల కమీషన్ ఏం చేస్తోంది? బతికివుందా? లేక చచ్చిపోయిందా? రేపు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల మధ్య రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది. పటిష్ఠమైన బందోబస్తు అవసరం. దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అని వ్యాఖ్యానించారు. 
 
పోలీసు సహాయంతో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అధికార పార్టీ సిద్ధమైనట్లు పక్క సమాచారం అందింది. ధర్మ యుద్ధంలో ఓడిపోతామని తెలిసి, జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధానికి శ్రీకారం చుట్టారు. ధర్మయుద్ధం జరిగితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments