Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:51 IST)
తిరుమల బూందీ తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. లడ్డూ తయారీ కోసం తయారు చేసే 19వ బూందీ పోటులో అ ప్రమాదం జరిగింది. ఇందులో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. బూందీ పోటులో గోడలకు నెయ్యి అంటుకుని ఉండడంతో మంటలు మరింత పెరిగాయి. 
 
కొద్దిసమయంలోనే మంటలు వ్యాపించడంతో బూందీ పోటులో ఉన్న కార్మికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు కూడా పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవ్వాక్కయ్యాడు. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలోనూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని అధికారుల దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments