Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల లడ్డు: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో వైసిపి మోత

ఐవీఆర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (19:39 IST)
తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు ఎలా చెబుతారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో వైసిపి కార్యకర్తలు, మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లడ్డూ వివాదంతో తిరుమలేశుని భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయడు క్షమాపణలు చెప్పాలంటూ హోరెత్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నల నేపధ్యంలో కూటమి సర్కార్ తదుపరి ఎలా స్పందిస్తున్నది వేచి చూడాల్సి వుంది. 
 
తిరుమల లడ్డూ కేసుపై సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది నెయ్యిని ఉపయోగించారా లేదా అన్నది ఇపుడు తేలాల్సిన విషయమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించరా, ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ కల్తీ జరిగిన నెయ్యిని వెనక్కి పంపించినట్టు మరోవాదన ఉంది. దీంతో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారా లేదా అన్నిది తేలాల్సిన విషయమన్నారు. 
 
తితిదే పూర్వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామిలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. లడ్డూ తయారీకి ఉయోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు అనుమానాలు రావడంతో అధికారులు తనిఖీ చేసి, నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్‌కు చెందిన ట్యాంకర్లను పరీక్షకు పంపారని టీటీడీ తరపు న్యాయవాది వెల్లడించారు. ఆ రిపోర్టు ఆధారంగానే, లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు నిర్ధారణకు వచ్చారని తెలిపారు.
 
దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ... కేవలం ఒక్క ల్యాబ్‌లోనేకాకుండా... ఘజియాబాద్, మైసూర్‌లలో ఉన్న ల్యాబ్‌లలో నెయ్యి శాంపిల్స్‌ను ఎందుకు పరీక్ష చేయించలేదు? దర్యాప్తు పూర్తి కాకుండానే కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? అని ప్రశ్నించింది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని పేర్కొంది. జూన్, జూలై నెలలో ఎన్ని ట్యాంకర్లు వాడారనే వివరాలను తితిదే తరపు న్యాయవాది కోర్టకు తెలిపారు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటి, రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ, తదుపరి విచారణను అక్టోబరు 3 తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

బకెట్‌ ని వెపన్ గా పట్టుకొని నాగ చైతన్య తండేల్ ఫైట్

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన విశాల్ మదగజరాజా ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments