చెప్తా... చెప్తా... కరెక్ట్ సమయం చూసి పరకాల ప్రభాకర్‌కు...: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను ప్రశ్నించడం ఊపందుకున్నది. ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (20:18 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను ప్రశ్నించడం ఊపందుకున్నది. ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్ర‌జార్యాజ్యం పార్టీలో స్వేచ్ఛ‌లేద‌ని అప్ప‌ట్లో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారనీ, పార్టీ కార్యాల‌యంలోనే ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ పార్టీని తిట్టాడ‌ని... మరలాంటప్పుడు పార్టీలో స్వేచ్ఛ ఉన్న‌ట్లా? లేదా? అని కార్యకర్తలనుద్దేశించి ప్ర‌శ్నించారు.
 
ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లాంటి వారికి కరెక్ట్ సమయం చూసి త‌గిన గుణపాఠం చెబుతాన‌ని అన్నారు. రాజకీయ పార్టీల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయనీ, వాటిని సరిదిద్దుకుంటామన్నారు. ఐతే తను పొరపాట్లు చేయవచ్చునేమోగానీ తప్పులు మాత్రం చేయనన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలవడం తనకు ఎంతో బాధ కలిగించిందనీ, ఐతే ఆ ఓటమికి కారణమైన ఏ ఒక్కరిని కూడా తను మర్చిపోలేనని అన్నారు. రాజకీయాల్లో నాయకులకు సహనం, ఓర్పు, విజ్ఞత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments