Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావు కేజీ పిట్ట మాంసానికి ముప్పావు కేజీ మసాలా.. ఇదీ మోడీ పాలన : తులసి రెడ్డి

Webdunia
సోమవారం, 25 మే 2015 (20:48 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం యేడాది పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. మోడీ యేడాది పాలన 'పావు కేజీ పిట్ట మాంసానికి ముప్పావు కేజీ మసాలా' అన్నట్టు సాగిందని ఆయన ఎద్దేవా చేశారు.
 
ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ ప్రధాన మంత్రి పదవిలో కంటే విదేశాంగ శాఖా మంత్రిగా బాగా రాణిస్తారని ఎద్దేవా చేశారు. సుష్మాస్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రి అనే విషయం మరచిపోయి, తానే విదేశాంగ మంత్రిగా ప్రధాని వ్యవహరిస్తున్నారని దెప్పిపొడిచారు. 
 
నరేంద్ర మోడీ నెలకో పథకం పేరిట స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, టీమిండియా, జనధన్ యోజన అంటూ ఘనంగా ప్రారంభించడమైతే చేశారు కానీ, ఆయన ఏదీ బాధ్యతగా తీసుకోలేదని, ఆయా కార్యక్రమాలను బాధ్యతగా పూర్తి చేయడం లేదని విమర్శించారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ప్రమాణాలు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు విభజన చట్టంలోని అంశాలను మాత్రమే నెరవేరుస్తామన్నారా? అని ప్రశ్నించారు. మోడీ మాటమీద నిలబడే మనిషి కాదని ఆయన స్పష్టం చేశారు. మోదీ పాలన 'మేడిపండు చూడ మేలిమై ఉండ పొట్టవిప్పి చూడ పురుగులుండ' అన్నట్టు ఉందని తురసి రెడ్డి మండిపడ్డారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments