వివేకాను చంపినట్టే నీ భర్తను హత్య చేస్తాం : ఉమాశంకర్ రెడ్డి భార్యకు వార్నింగ్

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (16:21 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్.వివేకానంద రెడ్డి కేసులోని నిందితుల్లో ఒకరైన గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతికి కసుమూరు పరమేశ్వర్ రెడ్డి, ఆయన కుమారుడు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. వివేకానంద రెడ్డిని హత్య చేసినట్టే నీ భర్త ఉమాశంకర్ రెడ్డిని హత్య చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం కసుమూరు పరమేశ్వర్ రెడ్డి, ఆయన కుమారుడు తమ ఇంటి వద్ద భయానక వాతావరణం సృష్టించారని ఉమాశంకర్ రెడ్డి స్వాతి తెలిపారు. తన భర్తను చంపేస్తానని హెచ్చరించారని, బయటకు చెప్పలేని విధంగా బూతులు తిట్టారని ఆమె ఆక్రోశం వ్యక్తం చేశారు. పైగా, తమను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని, తన ఫోనును లాక్కొని కిందపడేశారని ఆమె వెల్లడించారు. ఈ దాడిలో తనకు గాయాలు తగిలాయని, చికిత్స కోసం పులివెందుల ఆస్పత్రిలో చేరారని స్వాతి తెలిపారు.
 
శనివారం మధ్యాహ్న 1.45 గంటల సమయంలో పరమేశ్వర్ రెడ్డి, ఆయన కుమారుడు తమ ఇంటికి వద్దకు వచ్చి వీరంగం సృష్టించారు. వివేకాను చంపేసి ఇక్కడొచ్చి కూర్చున్నారా అంటూ బూతులు తిట్టారు. నీ భర్తకు ఇంటికి వచ్చాక వివేకాను ఎలా చంపారే అతడ్ని కూడా అలాగే చంపుతామని బెదిరించారు. నిన్ను కూడా చంపుతాం. నిన్ను చంపితే ఇక్కడ దిక్కెవరు అంటూ నన్ను బెదిరింతారు. వారు మాట్లాడిన బూతులు నేను బయటకు చెప్పుకోలేను. కాలికి ఉన్న చెప్పు తీసి కొట్టడం ప్రారంభించారు. దాతో మరో గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను" అని స్వాతి ఆస్పత్రిలో మీడియాతో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments