Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులా? వైసిపి ఏజెంట్లా?: ఎమ్మెల్యే గద్దె రామమోహన్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (19:27 IST)
రాష్ట్రంలో కొంత మంది పోలీసులు వైసిపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ నేడొక ప్రకటనలో విమర్శించారు.

టెక్కలి పట్నంకు చెందిన హరిజన యువకుడు మర్రి జగన్ పై పలాస సిఐ వైసిపి నాయకుల ప్రోద్భలంతో బూట్ కాలితో తన్నడం , చీరాలలో కిరణ్ అనే యువకుడు మాస్క్ వేసుకోలేదని పోలీసులు తల పగులగొట్టి అతని చావుకు కారణమవడం, అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వైసిపి ప్రోద్బలంతో పరప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీసులే శిరోమండనం చేయించడం చూస్తుంటే కొన్ని పోలీసు స్టేషన్లు, వైసిపి కార్యాలయాలుగా పనిచేస్తున్నట్లు కనపడుతున్నాయని ప్రశ్నించారు.

గతంలో రాజమండ్రిలో దళిత బాలికపై అత్యాచారం, నర్సీపట్నం డాక్టర్ విషయంలో లాఠీలతో బాధి, పశువుని కట్టేసినట్లు కట్టిన సందర్భం, దళిత మహిళా డాక్టర్ అనితారాణిని వేధించడం, మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ కుమార్ పై తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ దళితులపై జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తెలియజేస్తుందన్నారు.

ఆదిలోనే దళితులపై జరిగిన దాడిపై ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా దళితుల విషయంలో ప్రభుత్వం వ్యతిరేక వైఖరి విడనాడి దళితులకు ఆత్మ స్తైర్యాన్ని కలిగించాలని, లేనిపక్షంలో దళితులంతా తిరగబడతారని గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments