పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శన

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (14:51 IST)
తన తప్పు లేకపోయినా మందలించారన్న మనస్తాపంతో ఓ పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు. గత రాత్రి 10:30-11 గంటల మధ్య విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసు అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అధికారి అడ్డుకున్నారు. దీంతో వారు మంత్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మంత్రి అనుచరులు వెళ్తున్న కార్లను ఆపిన పోలీసు అధికారికి ఫోన్ చేసి మందలించారు.
 
అయితే, తాను ఎటువంటి తప్పూ చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తామంటూ పై అధికారులు మండిపడ్డారని సదరు పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, తీవ్ర మనస్తాపంతో చొక్కా విప్పి నిరసన తెలిపారు.

కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ అది నిరసన కాదని, అతడు ఫిట్స్ వచ్చి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం