Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో డబ్బు ప్రభావం: జేపీ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (05:24 IST)
రాజకీయాల్లో డబ్బు పాత్ర పెరిగిపోవడంతో సంపన్నులే ఎన్నికల బరిలో దిగుతున్నారని లోక్​సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటై 23 ఏళ్లు అయిందని లోక్​సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు.

దీనిద్వారా ఇప్పటివరకు 3 రాజ్యాంగ సవరణలు, 8 చట్టాలు సాధించామని చెప్పారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రజలకు తాయిలాలు అందించి సరిపెడుతున్నారని తెలిపారు. ప్రజల బతుకులు మాత్రం మారట్లేదని.. మార్చేందుకు నేతలు చొరవ చూపట్లేదని పేర్కొన్నారు.

ఆచరణలో భారత ప్రజాస్వామ్యం- రాజకీయాల్లో డబ్బు ప్రభావం అనే అంశంపై హైదరాబాద్​లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 9, 10 తేదీల్లో రాజకీయాల్లో ధన ప్రభావంపై ఐఎస్‌బీలో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తామని జేపీ తెలిపారు.

సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలనే అంశంపై చర్చిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments