Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యోపాపం.. తండ్రీ, కూతుళ్ళు వరద నీటిలో కొట్టుకుపోయారు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:12 IST)
పెళ్ళికి వెళ్ళి వస్తూ కారులో సందడి చేస్తూ కూర్చుని ఉంది ఓ కుటుంబం. ఉన్నట్లుండి వరద నీటిలోకి కారు వెళ్ళిపోయింది. దీంతో వారు కొట్టుకుపోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడితే మరో ఇద్దరు గల్లంతయ్యారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. 
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వడ్డిపల్లికి చెందిన ప్రతాప్ తన భార్య, కుమార్తె అనితతో పాటు బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు చిత్తూరుకు వెళ్ళారు. నిన్న సాయంత్రం రిసెప్షన్ చూసుకుని ఇంటికి కారులో పయనమయ్యారు. 
 
డ్రైవర్ కారును నడుపుతూ పెనుమూరు మండలం కొండయ్యగారి వంక వద్దకు వచ్చాడు. రాత్రి వేళ కావడంతో నీటి ప్రవాహం డ్రైవర్‌కు కనిపించలేదు. అందులోను నిద్రమత్తులో ఉన్నాడు. ఎప్పటిలాగే కారును వాగులో దించాడు. దీంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. 
 
కారు వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్, ప్రతాప్ భార్య ఎలాగోలా వరదనీటి నుంచి తప్పించుకున్నారు. కానీ ప్రతాప్, ఆయన కుమార్తె అనిత మాత్రం గల్లంతయ్యారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు బోరున విలపిస్తూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments