డిసెంబరు నెలలో వర్షాలు అంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే డిసెంబరు నెలలో వరి పంటను కోత కోసేస్తారు. ఇంకా మెట్ట పంటలను కూడా కోసి నూర్పిళ్లు చేస్తుంటారు. మంచు కాలం కాబట్టి వర్షం పడదులే అన్న ధీమాతో పనులు సాగిస్తారు
డిసెంబరు నెలలో వర్షాలు అంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే డిసెంబరు నెలలో వరి పంటను కోత కోసేస్తారు. ఇంకా మెట్ట పంటలను కూడా కోసి నూర్పిళ్లు చేస్తుంటారు. మంచు కాలం కాబట్టి వర్షం పడదులే అన్న ధీమాతో పనులు సాగిస్తారు. కానీ డిసెంబరు 10 నుంచి 13 తేదీల మధ్య కోస్తాంధ్రలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వార్ధా తుఫాను విశాఖపట్టణనానికి ఆగ్నేయంగా 990 కిలీమీటర్ల దూరంలో ఉంది. ఈ తుఫాను క్రమంగా కదులుతూ కాకినాడ- నెల్లూరు మధ్య సముద్రాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి వరి చేలను కోతలు కోసేందుకు సిద్ధమవుతున్న రైతులు ప్రస్తుతానికి తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని చెపుతున్నారు.