Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ఏపీలో ప‌న్నులు పెంచేస్తున్నారు: విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:39 IST)
స్థానిక సంస్థల్లో పన్నుల పెంపు అధికారం రాష్ట్ర పరిధిలోని అంశమా? లేక  కేంద్ర పరిధిలోని అంశమా? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

'మునిసిప‌ల్ ఎన్నిక‌లకు ముందు వైసీపీ ప్ర‌భుత్వం ప‌న్ను పెంపుపై నోరు మెద‌ప‌లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత ప‌న్నులు పెంచింది. ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. దాటిన తరువాత బోడి మల్లన్న అన్న తీరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది.

మ‌రోవైపు కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ప‌న్నులు పెంచుతున్న‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది' అని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు. 'కేంద్ర స‌ర్కారు ప‌న్నులు పెంచాల‌ని చెబితే అన్ని రాష్ట్రాల్లోనూ పెర‌గాలి క‌దా? మ‌రి ఇత‌ర‌ రాష్ట్రాల్లో ఎందుకు పెర‌గ‌లేదు? స్థానిక సంస్థ‌ల ప‌రిధిలో ప‌న్నుల పెంప‌కం కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం కాదు క‌దా?

అంతేగాక‌  విపక్షాలే ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ అంటున్నారు' అని  విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 'ఏపీలో ఎన్నిక‌లు అయిపోయాయి కాబ‌ట్టి ఏం చేసినా చెల్లుతుంద‌ని అనుకుంటున్నారు.

ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు ఓ చేతితో ఇచ్చి, మ‌రో చేతితో లాక్కునే చ‌ర్య‌ల‌కు పాల్పడుతోంది. ప‌న్నుల భారంపై బీజేపీ రాష్ట్ర నేత‌లు పోరాడతారు' అని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments