Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్, బీజేపీలు రెండూ నాటకాలాడుతున్నాయి... టీజీ వెంకటేష్ ఫైర్.....

కర్నూల్ : కాంగ్రెస్, బీజేపీపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కలసి రాష్ట్రంతో చెలగాటం ఆడుతున్నాయని, రాష్ట్ర విభజన విషయంలోనూ, ప్రత్యేక హోదా విషయంలోను, జిఎస్టీ బిల్లు విషయంలోను కాంగ్రెస్, బీజేపిలు కలిసే నాటకమాడాయని అ

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (18:39 IST)
కర్నూల్ : కాంగ్రెస్, బీజేపీపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కలసి రాష్ట్రంతో చెలగాటం ఆడుతున్నాయని, రాష్ట్ర విభజన విషయంలోనూ, ప్రత్యేక హోదా విషయంలోను, జిఎస్టీ బిల్లు విషయంలోను కాంగ్రెస్, బీజేపిలు కలిసే నాటకమాడాయని అన్నారు. రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఆ పార్టీకి దమ్ము, దైర్యం ఉంటే ప్రత్యేక హోదా బిల్లు ఆమోదించేంత వరకు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లును అడ్డుకోవాలని  కోరారు. 
 
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మాట తప్పితే జగన్ రాష్ట్ర బంద్‌కు ఎందుకు పిలుపు ఇచ్చిందో అర్థం కావడం లేదని, ధైర్యం ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని అన్నారు. బీహార్ రాష్ట్రానికి 90 వేల కోట్లు బీజేపీ ఏ ప్రణాళికతో ప్రకటించిందని, ఏపీకి ఎందుకు ప్రణాళికలో లేదని ఎలా చెబుతున్నారని మండిప‌డ్డారు. 
 
చంద్రబాబుకు ఓపిక నశించే, కాంగ్రెస్ పెట్టిన బిల్లుకు మద్దతు ఇవ్వమన్నారని తెలిపారు. బీజేపీతో అమితుమి తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, అయితే కొంతమంది పెద్దల సూచనతో ఆలోచిస్తున్నామ‌ని, మీడియాతో రాజ్యసభ సభ్యులు టి.జి వెంకటేష్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments