విశాఖపట్టణంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్స్ ప్రారంభం

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (13:18 IST)
విశాఖపట్టణం వేదికగా అగ్నివీరుల రిక్రూట్మెంట్స్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. త్రివిధ సైనిక దళాల్లో పని చేయాలని భావించే ఉత్సాహం కలిగిన యువత ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. 
 
స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 18 రోజులపాటు ఈ నెల 31వ తేదీ వరకు అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 
 
ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలనే ఉత్సహంతో ఉన్న ఏపీలోని శ్రీకాకుళం, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన వారితోపాటు, యానాంకు చెందిన అభ్యర్థులు పెద్దసంఖ్యలో శనివారం రాత్రే విశాఖ చేరుకున్నారు.
 
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన తేదీలవారీగా హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో తొలిరోజు రిక్రూట్‌మెంట్‌ కోసం స్టేడియానికి చేరుకున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని పగడ్బంధీగా నిర్వహించేందుకు 300 మందికి పైగా ఆర్మీ అధికారులు, సిబ్బందితో పాటు 500 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
 
పరీక్షలు జరిగే స్టేడియంలోపల, అభ్యర్థులు వచ్చే మార్గాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకోసం ఎక్కడికక్కడ సమాచారం తెలిపే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. వీరికితోడు మెడికల్, రెవెన్యూ సిబ్బంది అదనంగా జిల్లా అధికారులు నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments