Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మారణహోమానికి కుట్ర... విస్తృతంగా తనిఖీలు

హైదరాబాద్ నగరంలో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు నగరంలోని కీలక ప్రాంతాల్లో విస్త

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (09:51 IST)
హైదరాబాద్ నగరంలో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు నగరంలోని కీలక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా షాపింగ్‌మాల్స్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో దాడులు జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. 
 
అలాగే హైదరాబాద్‌, సైబరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలపై కూడా నిఘా వేసి ఉంచాలని కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం మాదాపూర్‌లోగల ఇనార్బిట్ మాల్‌లో పోలీసుల పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. బాంబు‌, డాగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 
లోపలికి వెళ్లే ప్రతీ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మాల్‌లోకి పంపిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్ర హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నగరంలోని షాపింగ్ మాల్స్ అన్నింటిని పోలీసులు అప్రమత్తం చేశారు. ఒకరకంగా నగరమంతా హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. 
 
వారాతం కావడంతో ఐటీ కారిడార్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఉగ్రవాదులు మాదాపూర్ మాల్స్‌ను టార్గెట్ చేశారని తెలుస్తోంది. రంజాన్ మాసంలో ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐటీ కారిడార్ అడుగడుగునా పోలీస్ తనిఖీలు కొనసాగుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments