Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో ఇద్దరికి కరోనా.. ఆ వైద్యుడి సంగతేంటి?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (09:50 IST)
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రెండు కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ రెండు కూడా నిత్యం వందలాది మంది రోగులకు వైద్యం చేసే ఒక డాక్టరు భార్య, ఆయన కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు, వైద్యుడికి మాత్రం కరోనా టెస్టులో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆయన వద్దకు వచ్చే రోగులంతా ఊపరి పీల్చుకున్నారు. మొత్తం 109 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ కరోనా నెగెటివ్ అని తేలడంతో అంతా తేలికపడ్డారు. 
 
మూడు రోజులుగా శ్రీకాళహస్తి ప్రజలకు, వైద్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దీనికి కారణం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడుకి కరోనా వైరస్ సోకినట్టు ప్రచారం జరగడమే. ఆ వైద్యుడి వద్దకు నిత్యం రోగులు అనేక మంది వస్తుంటారు. టోకెన్ విధాం లేదు. కన్సెల్టెన్సీ ఫీజు లేదు. కేవలం మందులు, ఇంజెక్షన్లకు మాత్రమే డబ్బులు తీసుకుంటారు. దీంతో శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రోగులు కూడా ఆయన వద్దకు వచ్చి వైద్యం చేయించుకుంటారు. 
 
అయితే, గత నెల 30వ తేదీన ఓ వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఆ వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందాడు. రెండు రోజుల తర్వాత ఆ వ్యక్తికి కరోనా అనుమానితుడుగా భావించి క్వారంటైన్‌కు తరలించారు. కానీ, నాలుగు రోజుల క్రితం వైద్యుడి భార్యకు, కుమార్తెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో వైద్యుడు కూడా స్వచ్చంధంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని తేలడంతో ఆయన వద్ద చికిత్స కోసం వచ్చిన వారితోపాటు వైద్యులు కూడా తేలికపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments