తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌కి కరోనా.. ఏపీలో కొత్తగా 3963 కేసులు

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (15:15 IST)
Tenali MLA
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 
 
జలుబు రావటంతో ముందు జాగ్రత్తగా శనివారం కరోనా పరీక్ష చేయించుకున్నట్లు శివకుమార్ తెలిపారు. వారి కుటుంబంలో అందరికి పరీక్ష చేయగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. చికిత్స తీసుకుంటున్నానని.. నియోజకవర్గంలో ప్రజలు అధైర్యపడొద్దు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తానని ఎమ్మెల్యే శివకుమార్‌ తెలిపారు.
 
ఏపీలో 3963 కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 589కు చేరిందని ప్రభుత్వం శనివారం బులిటెన్ విడుదల చేసింది. 
 
తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8, అనంతపురంలో 7, పశ్చిమగోదావరిలో 5, ప్రకాశంలో 4, నెల్లూరులో 3, విశాఖలో 2, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments