Webdunia - Bharat's app for daily news and videos

Install App

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (10:18 IST)
తెలుగు భాషకు మరింత గౌరవం రావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులైన జీవోలు తెలుగులోనూ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మొట్టమొదటి తెలుగు జీవో విడుదల కాగా, ఈ నిర్ణయంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలుగు భాషపై మరింత ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వివాదాస్పదంగా మారింది. ఇది తెలుగు భాష భవిష్యత్తుపై ప్రాముఖ్యత కోల్పోయేలా చేస్తుందని అప్పట్లో అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఏపీ సర్కారు తొలిసారిగా తెలుగులో జీవో విడుదల చేయడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో జీవోలు రావడంతో ప్రజలకు అవగాహన పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రభుత్వం ప్రతి జీవోని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని నిర్ణయించింది. 
 
ప్రస్తుతం ప్రభుత్వం ఒక జీవోను ఇంగ్లీషులో విడుదల చేసిన రెండు రోజులకు తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వ పనితీరు పైన ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments