Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ దందా: అకున్ సబర్వాల్ సెలవులు రద్దు.. కస్టడీలోకి కెల్విన్‌..

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ దందాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వినబడుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో.. డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ డైరెక్టర్ అక

Webdunia
శనివారం, 15 జులై 2017 (11:33 IST)
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ దందాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వినబడుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో.. డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పది రోజుల పాటు సెలవులు వేయడం సబబు కాదని అందరూ భావించారు. విపక్షాలు సైతం డ్రగ్స్ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాసిన ఆయన పదిరోజులు లీవు పెట్టి వెళ్లడంపై విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో, ఆయన వెనక్కి తగ్గారు. వక్తిగత సెలవులను రద్దు చేసుకున్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన సెలవు వాయిదా వేసుకున్నారు. 
 
అకున్ సబర్వాల్ సెలవుపై వెళితే, ఆయన స్థానంలో ఈ కేసును ఎవరు డీల్ చేస్తారంటూ విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దీంతో, కాస్త ఇబ్బందికి గురైన ప్రభుత్వం ఆయన సెలవును రద్దు చేసినట్టు సమాచారం. నేటి నుంచి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు అకున్‌కు సెలవులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం వాటిని అకున్ రద్దు చేసుకున్నారు. కాగా ఇప్పటికే డ్రగ్స్ కేసులో 12 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. డ్రగ్స్ కేసులో నోటీసులు అందిన వారిని సిట్ వ్యక్తిగతంగా విచారించనుంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ డీలర్ కెల్విన్‌ను ఎక్సైజ్ సిట్ తమ కస్టడీలోకి తీసుకుంది. హైదరాబాదులోని చర్లపల్లి జైల్లో ఉన్న కెల్విన్‌ను విచారణ నిమిత్తం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments